Header Banner

నిద్ర పట్టట్లేదా? హాయిగా నిద్ర కోసం బెస్ట్ హెర్బల్ టీలు ఇవే!

  Wed Mar 12, 2025 19:16        Health

ప్రస్తుత కాలంలో నిద్రలేమి సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. నిద్ర సరిపోకపోతే శరీర ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. అలసట పెరిగి, రోజువారీ పనులు చేయడంలో కూడా అసహనానికి గురి అవుతారు. దీర్ఘకాలంగా నిద్రలేమి కొనసాగితే ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంటుంది. అయితే, అటువంటి వారికి సహాయపడే సహజసిద్ధమైన మార్గాల్లో హెర్బల్ టీలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. మానసిక ఆందోళన, ఒత్తిడిని తగ్గించి, హాయిగా నిద్ర పట్టేందుకు ఈ టీలు సహాయపడతాయి.

 

అటువంటి నిద్రను మెరుగుపరిచే టీల్లో గ్రీన్ టీ ఒకటి. గ్రీన్ టీలో ఎల్-థియనైన్ అనే అమైనో యాసిడ్ అధికంగా ఉండటంతో ఇది మనకు ప్రశాంతతను కలిగించి నిద్రను ప్రేరేపిస్తుంది. అయితే, ఎక్కువ క్యాఫైన్ కలిగిన గ్రీన్ టీ కన్నా, తక్కువ క్యాఫైన్ కలిగిన రకం ఎంచుకోవడం మంచిది. అలాగే, చామంతి టీ (చమోమైల్ టీ) కూడా నిద్ర సమస్యలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ శరీరాన్ని రిలాక్స్ చేయడంతో పాటు నాణ్యమైన నిద్రను అందిస్తాయి. అలాగే, లావెండర్ టీ కూడా ఒత్తిడిని తగ్గించి, నిద్ర నాణ్యతను పెంచడంలో సహాయపడుతుంది. ఈ టీలు తాగినప్పుడు మన శరీరం సులభంగా రిలాక్స్ అవుతుంది, ఆందోళన తగ్గిపోతుంది, దీంతో హాయిగా నిద్రపట్టే అవకాశం ఉంటుంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


గత ప్రభుత్వంలో మహిళలకు న్యాయం లేదు.. నాపైనే 23 కేసులు! హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు!


టీటీడీకి భారీ విరాళాలు! తిరుమల అన్నప్రసాద సేవలో విప్లవాత్మక మార్పులు!



అమరావతి అభివృద్ధికి భారీ నిధులు.. చంద్రబాబు నేతృత్వంలో కీలక భేటీ! కోట్ల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్!


రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఘర్షణ! అసెంబ్లీలో కీలక ప్రకటన!


జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత కీలక షెడ్యూల్ విడుదల! ఏ పరీక్ష ఏయే తేదీల్లో అంటే!


ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్... రాజమండ్రి సెంట్రల్ జైలుకు రౌడీషీటర్ ఎంట్రీ! ముగిసినా అజ్ఞాతం!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #Insomnia #HerbalTea #BetterSleep #GreenTea